హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారామెడికల్ కోర్సుల మెరిట్ జాబితా విడుదల

ELR: ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సుల మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ పి. సావిత్రి తెలిపారు. ఈ జాబితాలను నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచామన్నారు. మెరిట్ జాబితాలోని స్థానిక అభ్యర్థులు ఈ నెల 16న, దూర ప్రాంతాల వారు 17న ఉదయం 10:30 గంటలకు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు.