హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలోని కొండపేట కాలనీలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి తీర్థప్రసాదాలను అందజేశారు.