హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేతిపంపునకు మోటార్లు.. 13 ఇళ్లకు నీటి సరఫరా

ASF: రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గౌతమ్‌నగర్ వాసులు తాగునీటి సమస్య పరిష్కారానికి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన చేతిపంపునకు పైపులు అమర్చి విద్యుత్తు మోటార్లు బిగించారు. ఈ విధంగా 13 ఇళ్లకు నీరు సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అవసరమైనప్పుడు మోటార్లు ఆన్‌ చేసుకుని నీటిని వినియోగిస్తున్నారు.