హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు దేవరాజ్ ఎంపిక

MLG: ములుగు మండలం జాకారం గురుకుల పాఠశాల విద్యార్థి దేవరాజ్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. గురువారం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన అండర్‌–19 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వరంగల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ప్రథమ స్థానం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా కోచ్ పవన్‌తో పాటు పాఠశాల సిబ్బంది దేవరాజ్‌ను అభినందించారు.