SRCL: సద్దుల బతుకమ్మను సాధారణంగా తొమ్మిదో రోజు నిర్వహించడం ఆనవాయితీ. జిల్లాలోని వేములవాడ, శాతరాజుపల్లి, సంకెపల్లి గ్రామాల్లో మాత్రం ఏడో రోజే సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ సంప్రదాయంలో భాగంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. మహిళల భక్తి భావానికి, ఆత్మీయతకు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పడుతున్నాయి.
తెలంగాణ
అక్కడ ఇవాళే సద్దుల బతుకమ్మ


