హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న ధాన్యం గుర్తింపునకు ప్రత్యేక చర్యలు: DAO

ఖమ్మం జిల్లాలో 7 రకాల సన్న ధాన్యం గుర్తింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు DAO పుల్లయ్య గురువారం తెలిపారు. ఈ సన్న రకాలు సాగు చేసిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ధృవీకరణ కోసం వ్యవసాయ విద్యార్హత ఉన్న సిబ్బందిని నియమిస్తామని, ఆసక్తి గల అర్హులు వెంటనే స్థానిక MAOలను సంప్రదించాలని ఆయన కోరారు.