హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు శాఖలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్?

WGL: వరంగల్ డీఐజీ స్థాయి ఉన్నతాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. పోలీసు శాఖలో కానిస్టేబుల్‌ నుంచి ఎస్సై వరకు జరిగిన బదిలీల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ గురువారం ఫిర్యాదు చేయగా విచారణచేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.