కాకినాడ: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. చీరలు, ఆభరణాలు తరలిస్తే తప్పనిసరిగా బిల్లులు చూపించాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో SPతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సీజ్'


