హైదరాబాద్: 28°C
తెలంగాణ

6వేల గాజులతో అమ్మవారి అలంకరణ

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని మురళీకృష్ణ మందిరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఐదో రోజు సందర్భంగా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారిని 6,000 గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. గాజుల అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.