NDL: ఆత్మకూరు పట్టణంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని కిసాన్ సింగ్ కాలనీకి చెందిన వైసిపి మహిళా నాయకురాలు సుశీలబాయి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో మహిళలు వైసీపీ నుండి టిడిపిలోకి 150 కుటుంబాల వారు చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి జలక్.. టిడిపిలోకి 150 కుటుంబాలు చేరిక


