WG: పండగల సమయంలో ప్రజలపై నిత్యావసర వస్తువుల ధరల భారం మోపడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి. బలరాం అన్నారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. బియ్యం, పంచదార, చింతపండు, పప్పులు, నూనె, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
నిత్యావసరాల ధరల నియంత్రణకు CPM డిమాండ్


