హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్లతో కప్పుకుపోతున్న రహదారి.. ప్రమాదాల భయం

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త–నాగారం గ్రామాల మధ్య ప్రధాన తారు రహదారికి ఇరువైపులా చెట్లు పెరిగి రోడ్డును కప్పేస్తున్నాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎదురుగా వచ్చే వాహనాలు సమీపంలోకి వచ్చే వరకు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.