హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడలో డ్రంక్ అండ్ డ్రైవ్.. 35 మందికి జరిమానా

కాకినాడ: రోడ్డు ప్రమాదాల నివారణకు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 35 మంది మద్యం తాగి పట్టుబడినట్లు కాకినాడ ట్రాఫిక్ వన్ టౌన్ CI నూని రమేశ్ తెలిపారు. వీరిని గురువారం కాకినాడ న్యాయస్థానంలో హాజరుపరచగా మెజిస్ట్రేట్ జరిమానా విధించినట్లు వెల్లడించారు. ప్రమాదాల నియంత్రణ కోసం నగరంలో నిరంతరం డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు.