హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉమ్మడి తూ.గో జిల్లాలో కూటమి సీట్ల పంపకం పూర్తి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కూటమి సీట్ల పంపకం పూర్తయింది. మొత్తం 12 స్థానాల్లో జనసేనకు 7, TDPకి 5 స్థానాలు కేటాయించారు. తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, ముమ్మిడివరం, అమలాపురం, నిడదవోలు జనసేనకు దక్కాయి. ఏలేశ్వరం, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, కొవ్వూరు TDPకి కేటాయించారు.