జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో జూన్ 26న ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మూడు నెలలు దాటినా సిబ్బందిని నియమించలేదు. 12 గదులతో నిర్మించిన భవనంలో వైద్యులు, సిబ్బంది, అవసరమైన ఫర్నిచర్, మందులు అందుబాటులో లేవు. వడ్డెలింగాపూర్ నుంచి డిప్యూటేషన్పై వచ్చిన నర్సింగ్ అధికారి అప్పుడప్పుడు వచ్చి జ్వరం, జలుబు మందులు ఇస్తున్నారు.
తెలంగాణ
నిరుపయోగంగా బీర్పూర్ పీహెచ్సీ


