హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాంపా కోలా ఫ్రాంచైజీ పేరుతో రూ.2.61 లక్షలు స్వాహా

WGL: క్యాంపా కోలా ఫ్రాంచైజీ ఇప్పిస్తామంటూ ఓ వ్యక్తిని మోసం చేసి రూ.2.61 లక్షలు కాజేశారు. అల్వాల్కు చెందిన ఉద్యోగి కిరణకుమార్ ఫేస్బుక్ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ డిపాజిట్, ఇతర ఛార్జీల పేరుతో విడతల వారీగా నగదు వసూలు చేశారు. అనంతరం స్పందించకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.