TG: తలలు అతుక్కుని జన్మించిన అవిభక్త కవలలు వీణ-వాణీలు ఇవాళ 24వ వసంతంలోకి అడుగుపెట్టారు. తమ పిల్లలను విడదీయాలని కోరుతూ ప్రభుత్వాలు, వైద్యులను వేడుకున్నా ఫలితం లేకపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శిశువిహార్లో ఉంటూ బీకాం పూర్తి చేశారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు పరీక్షించినప్పటికీ, వారిని వేరు చేయడం సాధ్యపడలేదని తల్లిదండ్రులు తెలిపారు.
వార్తలు
విడిపోని బంధానికి 24 ఏళ్లు..!


