హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌‌లో నీటి వనరులపై సమీక్ష

WGL: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డా, సత్య శారద అధ్యక్షతన నీటి వనరుల సంరక్షణపై సమీక్ష సమావేశం జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని సాగునీటి సదుపాయాల మెరుగుదలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రైతులకు మెరుగైన సాగునీరు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.