హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీఓ సమావేశం

VZM: భోగాపురం MPDO స్వరూపరాణి స్దానిక మండల పరిషత్‌ సమావేశ భవనంలో వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు, VROలు, పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.