హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్మికులకు ఎక్స్‌గ్రేషియా పునరుద్ధరించాలి'

NLG: 59 ఏళ్లు పైబడిన చేనేత కార్మికులకు ఎక్స్‌గ్రేషియా పథకాన్ని పునరుద్ధరించాలని పద్మశాలి సంఘం నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం హైదరాబాద్ లోని సచివాలయంలో నల్గొండకు చెందిన అవ్వారి భాస్కర్ మంత్రికి వినతిపత్రం అందజేశారు. టెస్కోకు ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.