హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెయింట్ ఆన్స్ కళాశాలలో ఈ-వ్యర్థాలపై అవగాహన

BPT: వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రపంచ ఈ-వ్యర్థాల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య వక్త ఆవల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాత ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ నిర్లక్ష్యంగా పారేస్తే పర్యావరణం కలుషితమవుతుందని హెచ్చరించారు. ఈ-వ్యర్థాల నివారణకు రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ సూత్రం పాటించాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ సి.ఎస్.రావు, ప్రిన్సిపాల్ జగదీష్ పాల్గొన్నారు.