హైదరాబాద్: 28°C
తెలంగాణ

మ్యాట్రిమోనీలో మోసం.. వ్యక్తి అరెస్ట్

MDCL: మ్యాట్రిమోనీని ఆసరాగా చేసుకుని మహిళను మోసగించిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. శాదీ.కామ్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి, రైల్వేలో సెక్షన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నానని నమ్మించిన పుల్లగూర సూర్యనారాయణ (33) పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళతో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడు. అనంతరం బెదిరింపులకు పాల్పడి రూ.1.10 లక్షలు వసూలు చేశాడు.