హైదరాబాద్: 28°C
తెలంగాణ

12 గంటల్లో హత్య కేసు ఛేదించిన పోలీసులు

SRCL: ఎల్లారెడ్డిపేట (M) రాచర్ల గొల్లపల్లిలో టైల్స్ కాంట్రాక్టర్ పవన్ సింగ్ హత్య కేసును పోలీసులు 12 గంటల్లో ఛేదించారు. డబ్బుల కోసం పనిచేసే కూలీలే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రధాన నిందితులు జోగిందర్, శివమ్‌లను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. DSP నాగేంద్రచారి వివరాలు వెల్లడించారు.