హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు

NRPT: మాగనూరు మండలం మందిపల్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ వార్డు సభ్యులు కే.సదాశివ, యాంకి నర్సింహులుతో పాటు, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మంత్రి వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.