హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి

NLG: జిల్లా గట్టుప్పల్ మండలం అంతంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు నర్సింగ్ రాములు (50) గురువారం రాత్రి తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి మృతిచెందాడు. మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంపత్ తెలిపారు. రాములు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.