హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారామెడికల్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండేళ్ల ఇసిజి, డయాలసిస్ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రిన్సిపల్ సంపత్ కుమార్ దరఖాస్తులు ఆహ్వానించారు. రెండు కోర్సుల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని, అర్హులు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. క్లాసులు నవంబర్ 11 నుంచి ప్రారంభమవుతాయని, పూర్తి వివరాలకు www.tgpmb.telangana.gov.in చూడాలన్నారు.