హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం మేయర్ స్థానం బీజేపీకి కేటాయింపు

ATP: స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులో భాగంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని కూటమి అధిష్టానం భారతీయ జనతా పార్టీ (BJP)కి కేటాయించింది. ఈ మేయర్ పీఠం బీసీ (జనరల్) కేటగిరీకి రిజర్వ్ కావడంతో, ఆ వర్గానికి చెందిన బలమైన నాయకుడిని బరిలోకి దింపేందుకు బీజేపీ కసరత్తు పూర్తి చేస్తోంది. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించనున్నారు.