హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపాలిటీల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

MDK: మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల సమగ్ర పురోగతికి పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు. పారిశుద్ధ్యం, తడి-పొడి చెత్త సేకరణ, తాగునీరు, వీధి దీపాలు, పెండింగ్ పనుల వేగవంతంతో పాటు 100 శాతం ఆస్తి పన్నుల వసూళ్లే లక్ష్యంగా యంత్రాంగం నిష్ఠతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.