హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కరీంనగర్‌లో విద్యుత్ సరఫరా బంద్

KNR: కరీంనగర్ నగరంలో విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ లావణ్య వెల్లడించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ముకరంపుర, బస్టాండ్, జడ్పీ ఆఫీస్ ప్రాంతాలలో సరఫరా ఉండదని, అలాగే ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బైపాస్ రోడ్, డీమార్ట్, ఐటీ టవర్ పరిసరాల్లో సరఫరా ఉండదని ప్రజలు సహకరించాలని కోరారు.