హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NLR: శరన్నవరాత్రుల సందర్భంగా అల్లూరులోని దసరా దేవస్థానంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని జగన్మాతను ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.