హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు

NTR: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి, 4.30 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం 5.30 గంటలకు తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.