హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

KMR: బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డులకు చెందిన 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నివాసంలో లబ్ధిదారులకు మంజూరు ప్రొసీడింగ్‌ పత్రాలను పంపిణీ చేశారు. ఇళ్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.