SKLM: సారవకోట మండలం వెంకటాపురం సమీపంలో పొలాల్లోకి కారు దూసుకెళ్లింది. కొరసవాడ వాసులు చిలకపాలెంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు..ఐదుగురికి గాయాలు


