హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి దసరా సంబరాలు

TPT: తిరుపతి శిల్పారామం ఆధ్వర్యంలో రేపటి నుంచి 20 వరకు దసరా సంబరాలు-2026 నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కూచిపూడి, భరతనాట్యం, వెస్ట్రన్, జానపద నృత్య ప్రదర్శనలు ఉంటాయి. వివిధ ప్రాంతాల కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొంటారని నిరహకులు తెలిపారు.