SKLM: గార మండలం వాడాడ గ్రామానికి చెందిన వివాహిత చింతనిప్పుల లలిత (24) గురువారం బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్తతో విభేదాలతో మనస్తాపం చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరికి 13 నెలల కుమారుడు ఉన్నాడు. లలిత తండ్రి ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
భర్తతో విభేదాలు.. వివాహిత బలవన్మరణం


