హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఏసీఎస్‌ ఛైర్‌పర్సన్‌గా వినోద

KMR: నిజాంసాగర్ మండలం మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్‌పర్సన్‌గా వినోద గురువారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.