హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బ్రహ్మోత్సవాల సమాచారాన్ని భక్తులకు అందిస్తున్నాం'

TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సమాచారాన్ని భక్తులకు విస్తృతంగా అందిస్తున్నామని టీటీడీ సీపీఆర్వో డాక్టర్ టి. రవి తెలిపారు. తిరుమల, తిరుపతిలో 25 సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 25 ఏళ్లలో 18 లక్షల మంది శ్రీవారి సేవకులు సేవలందించగా, బ్రహ్మోత్సవాల్లో ప్రస్తుతం 4,500 మంది సేవకులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.