హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్ అభ్యర్థిగా నూరీ ఫాతిమా?

గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా వైసీపీ తరపున గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జ్ నూరీ ఫాతిమాను పార్టీ అధినేత జగన్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉండటమే కారణమని చెబుతున్నారు. అయితే పార్టీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయిన సంగతి తెలిసిందే.