హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మన్యంలో జడ్పీటీసీ కోటా ఖరారు

పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లపై బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి. జడ్పీటీసీల్లో కొమరాడ, భామిని ఎస్టీ మహిళకు, సాలూరు, పాచిపెంట సహా ఐదు జనరల్ మహిళకు, పాలకొండ ఎస్సీకి దక్కాయి. ఎంపీపీల్లో కురుపాం, సీతంపేట ఎస్టీ మహిళకు కేటాయించారు. జడ్పీ చైర్మన్ ఎస్టీ జనరల్ కావడంతో ఎస్టీ స్థానాలకు ప్రాధాన్యం పెరిగింది.