హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి'

PDPL: వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష చేపట్టారు. రబీ సీజన్లో వరి పంట సాగు చేయవద్దని సూచించారు. కూరగాయలు, నూనె గింజలు, పప్పు దినుసులు మొదలైన పంటలు వేసుకోవాలని తెలిపారు. అవసరమైతే భూములను బీడు ఉంచుకోవాలని పేర్కొన్నారు.