హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక

KMR: పాల్వంచ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న పోటీల్లో బాలికల విభాగంలో ప్రణీత, మహేశ్వరి, బాలుర విభాగంలో ఈశ్వర్, అన్వేష్ పాల్గొననున్నారు. విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్ రెడ్డి అభినందించారు.