హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాన్‌షాపులో చోరీకి యత్నం.. ఇద్దరు పట్టివేత

MDCL: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్‌షాపులో చోరీకి యత్నించిన ఘటన చోటుచేసుకుంది. బీబీనగర్ మండలం రాయరావుపేటకు చెందిన బేతి భాను (20) అవుషాపూర్‌లో పాన్‌షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున ముగ్గురు దొంగలు షాపు తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. గమనించిన వ్యక్తి యజమానికి సమాచారం ఇవ్వడంతో ఇద్దరు పట్టుబడగా, సందీప్ పరారయ్యాడు.