హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు రూ.75 లక్షల కిరీటం

NTR: శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు గురువారం రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. శ్రీకాకుళానికి చెందిన కె. దుర్గా శ్రీనివాస్ కుటుంబం 494 గ్రాముల నవరత్నఖచిత కిరీటాన్ని ఆలయ ఈవో వీకే సీనానాయక్, దసరా ఉత్సవాల ప్రత్యేక అధికారి వి. త్రినాథరావులకు అందజేసింది.