హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు

SRPT: సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో  2026-27 పత్తి మార్కెటింగ్ సీజన్‌పై సమీక్షించారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని అన్నారు. పత్తి కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కొనుగోళ్లులో రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.