హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ భూ ఆక్రమణలపై కలెక్టర్ హెచ్చరిక

NZB: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నగరంలోని ముజాహిద్ నగర్ ప్రాంతంలో 2545 సర్వే నంబర్ లో 18 ఎకరాల ప్రభుత్వ భూమిలో 13 గుంటల భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించారు. ప్రభుత్వ భూముల కబ్జాలు ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.