PLD: సత్తెనపల్లి 28వ వార్డుకు చెందిన తండ్రిలేని విద్యార్థినులు షర్మిల, ఫాతిమా దూరం, ఆర్థిక ఇబ్బందుల వల్ల బడి మానేశారు. విషయం తెలుసుకున్న శేషగిరి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జీ.వీ. శేషగిరి, సైదా వారికి కొత్త సైకిళ్లు కొనిచ్చారు. టౌన్ సీఐ సీ.హెచ్. ప్రభాకర్ చేతుల మీదుగా వీటిని అందజేసి, పిల్లలను మళ్లీ బడిలో చేర్పించారు. ట్రస్ట్ సేవను సీఐ ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
పేద విద్యార్థినుల చదువుకు శేషగిరి ట్రస్ట్ భరోసా


