PDPL: ఓదెలమండలం మడక నుంచి కనగర్తికి వెళ్లే రహదారిపై గురువారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రహదారిలోని మూలమలుపు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అదుపుతప్పిన లారీలు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు, లారీల్లో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
మడక–కనగర్తి రహదారిపై రెండు లారీల ఢీ


