కోనసీమ: ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా గురువారం రాజోలు మండలం తాటిపాకలో ఈగల్ బృందం, రాజోలు పోలీసులు సంయుక్తంగా లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లాడ్జీలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్ల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆతర కార్యకలాపాలకు లాడ్జీలు వేదికలుగా మారకుండా లాడ్జి యజమానులకు సూచనలు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
లాడ్జిలలో ఈగల్ బృందం ఆకస్మిక తనిఖీలు


