హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మికుంట మార్కెట్లో స్వల్పంగా తగ్గిన పత్తి ధర

KNR: జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర స్వల్పంగా తగ్గింది. బుధవారం క్వింటా పత్తి ధర రూ.9,200 పలకగా, గురువారం రూ.100 తగ్గి రూ.9,100 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గురువారం 179 వాహనాల్లో 1,036 క్వింటాళ్ల విడి పత్తి మార్కెట్‌కు వచ్చినట్లు వెల్లడించారు. విక్రయాల ప్రక్రియను మార్కెట్ కార్యదర్శి మల్లేశం, ద్వితీయ శ్రేణి కార్యదర్శి రాజా పాల్గొన్నారు.