హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్

అన్నమయ్య: మదనపల్లె మండలం పులగూరవాండ్లపల్లెలో తండ్రిని కట్టెతో కొట్టి హత్య చేసిన కుమారుడిని తాలూకా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చక్కర సహదేవ (50) మద్యం తాగి ఇంట్లో గొడవ పడుతున్నాడని, ఈ నెల 13న రాత్రి కుమారుడు సంతోశ్ (24) కట్టెతో తలపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు.